ధాన్యం కొనుగోలు ప్రారంభం

ప్రజాశక్తి- డెంకాడ :  స్థానిక రైతు భరోసా కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపటడుతుందన్నారు. ధాన్యం కనీసం మద్దతు ద్వారా క్వింటాకు సాధారణ రకం రూ.2183గా నిర్ధారించినట్లు వెల్లడించారు. ధాన్యం మద్దతు ధరతో పాటు గోని సంచులు, లేబరు, రవాణా చార్జిస్‌ 21 రోజుల్లో రైతుల ఖాతాకు జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి సత్య వెంకట వాసుదేవ, పిఎసిఎస్‌ అధ్యక్షులు రొంగలి కనక సింహాచలం, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మి నాయుడు, గ్రామ సర్పంచ్‌ పతివాడ గౌరీ, సబ్‌ డివిజనల్‌ లెవెల్‌ కో-ఆపరేటివ్‌ ఆఫీసర్‌ విజరు కుమార్‌, వ్యవసాయ శాఖ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

➡️