ధాన్యం కొనుగోలు ప్రారంభం

Dec 15,2023 21:51

ప్రజాశక్తి-భోగాపురం :  భోగాపురం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. మండలంలో ఉన్న అన్ని ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఎఒ హరికృష్ణ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపిడిఒ అప్పలనాయుడు, సచివాలయ కన్వీనర్‌ సుందర హరీష్‌, సొసైటీ సిబ్బంది జనార్దన్‌రావు, రమేష్‌, నాయకులు కొయ్య బంగార్రాజు, మాజీ ఎంపిటిసి గురువులు, సుందర వెంకన్న పాల్గొన్నారు.గుర్ల : మండలంలోని తెట్టంగి, వల్లపురం రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైసిపి జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు, పలాస నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు జెడ్‌పిటిసి శీర అప్పలనాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో తెట్టంగి పిఎసిఎస్‌ చైర్మన్‌ రవిబాబు, సిఇఒ రామునాయుడు, మండల అధ్యక్షులు జమ్ము స్వామినాయుడు, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు మధుసూదన్‌ రావు, జమ్ము లచ్చన్న, ఎఒ తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.బొబ్బిలిరూరల్‌ : రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. మండలంలోని చింతాడ, కలవరాయి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మి, చింతాడ, కలవరాయి సర్పంచులు బంకురు తిరుపతి, బొత్స నటరాజ్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు శంబంగి సూరపునాయుడు, కోమటిపల్లి రామారావు, ఎంపిటిసి పాటూరి సింహాచలం, మాజీ ఎంపిటిసి కర్రి సూర్యనారాయణ పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలుపై సమావేశంవేపాడ : స్థానిక వైకెపి కార్యాలయంలో ఎఒ యశ్వంత్‌కుమార్‌ ఆధ్వర్యాన ధాన్యం కొనుగోలుపై శుక్రవారం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ మండలంలో 17,222 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, అందులో 16,361 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. 20 వేల గోనె సంచులు సిద్ధంగా ఉంచామన్నారు. సమావేశంలో సివిల్‌ సప్లై డిటి, ఎఇఒ అక్కునాయుడు, విఎఎలు పాల్గొన్నారు.

➡️