ధాన్యం రైతులు గగ్గోలు..

Jan 3,2024 20:47

ప్రజాశక్తి- రేగిడి : అన్నదాతలకు అడుగడుగునా ఆటంకాలు తప్పడం లేదు. మొన్న వర్ష భావం కారణంతో కొంత పంట నష్టం వాటిల్లగా నిన్నేమో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. వచ్చిన కొద్దిపాటి పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ధాన్యాన్ని రైతు మిల్లర్లకు పంపిస్తే అక్కడ 80 కేజీలకు గాను, 87 నుంచి 90 కేజీల వరకు (7నుంచి10కేజీలు) అదనంగా తూనికలు వేసి రైతుల ధాన్యాన్ని. దోచేస్తున్నారు. ప్రభుత్వం 80 కేజీలు తూనికలకు అంగీకరిస్తే మిల్లర్లు ఈ విధంగా దగా చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏమైనా ప్రశ్నిస్తే తీసుకువెళ్లిన లోడులను వెనక్కి పంపిస్తున్నారు. దూర ప్రాంతాల నుండి ధాన్యాన్ని ఎడ్ల బల్లతో మిల్లర్లకు తీసుకువెళ్లడంతో ఏమి తోచన పరిస్థితులలో ఎడ్ల బళ్ళు అద్దెలు కట్టుకోలేక తప్పనిసరిగా అదనపు ధాన్యాన్ని ఇవ్వవలసిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. రైతే రాజు అన్న ప్రభుత్వం, కస్టోడియన్‌ అధికారులైన విఆర్‌ఒలు, ఆర్‌ఐ, తహశీల్దార్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పాటు రైతుల బాధలు పట్టించుకోకపోవడంతో రైతులం ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని కొండల మామిడి వలస, పారం పేట, కోడిశ , సోమరాజుపేట గ్రామాల్లో ఉన్న రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం ధాన్యం ఆడేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 80 కిలోలు ధాన్యం బస్తాను తీసుకోవాల్సిన మిల్లర్లు ఒక్కో రైతు నుంచి అధనంగా 7 కిలోలు ధాన్యం తీసుకుని మొత్తం 87 నుంచి 90 కిలోల మధ్య ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఈ విధంగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారు. మిల్లర్ల ఒత్తిడిని తట్టుకోలేని కొంత మంది రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వసుందని చెబుతున్నారు. ప్రకటనలకే పరిమితంతుపాను కారణంగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తరలించి మంచి ధర కల్పిస్తామని మంత్రి, జెడ్‌పి చైర్మన్‌ చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు కొనగోళ్లకు ముందు ఆర్‌బికెల్లో రైతులతో సమావేశమై ఊకదంపుడు ఉపన్యాసాలే ఇచ్చారు తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన మిల్లర్ల పై చర్యలు తీసుకు సక్రమంగా ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దళారులదే హవామిల్లర్లు అదనంగా ధాన్యం తీసుకోవడంతో పాటు డబ్బులు వెంటనే చెల్లించకపోవడం, తరలింపునకు అధనపు భారం పడటంతో రైతులు దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు. దళారులు ప్రభుత్వం ధర కంటే తక్కువే ఇచ్చినా నేరుగా కళ్లాలకు వచ్చి ధాన్యం తరలించుకోవడంతో పాటు డబ్బులు వెంటనే చెల్లించేయడంతో చాలా మంది రైతులు దళారులకే ఇచేస్తున్నారు. దీంతో వారి హవా కొనసాగుతోంది.అదనపు కేజీలు తీసుకుంటున్నారు.మిల్లర్లు 80 కేజీలకు బదులుగా 87 నుంచి 90 కేజీల వరకు ధాన్యం అదనంగా తీసుకుంటున్నారు. ప్రశ్నిస్తే తిరిగి పంపించేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ కొరవడింది. తిరిగి వచ్చిస్తే వ్యయ ప్రయాసాలు తప్పవన్న బాధతో మిల్లర్లు డిమాండ్‌ మేరకు అదనంగా ధాన్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఘోరంగా ఉంది. పరిస్థితి మారకపోతే రైతు చాలా నష్టపోతాడు. దాలినాయుడు, రైతు, సంకిలి.మిల్లర్లుపై నిఘా ఉంచాలిపారంపేట, కెఎం.వలస, కోడిశ, సోమరాజుపేట గ్రామాల్లో రైస్‌ మిల్‌ యాజమాన్యం రైతుల వద్ద అదనంగా ధాన్యం తీసుకుంటున్నాయి. రైతులను మోసం చేయకుండా మిల్లర్లపై అధికారులు నిఘా ఉంచాలి. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతుకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి.నారు జనార్ధన రావు, రైతు సంఘం అధ్యక్షులుమా దృష్టికి రాలేదురైతుల వద్ద నుంచి మిల్లర్లు అదనంగా ఏడు నుంచి పది కేజీలు తీసుకుంటున్న విషయం మా దృష్టికి రాలేదు.. సిఎస్‌డిటి కామేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించాం. పరివేక్షణ తరువాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటాంసుదర్శన్‌ రావు, తహశీల్ధార్‌, రేగిడిఆర్‌బికెల్లో కొనుగోలు చేస్తున్నాంరైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మిల్లర్లకు రైతుల ద్వారా పంపిస్తున్నాం. మిల్లర్లు అదనంగా ధాన్యం వసూలు చేస్తున్నట్లు మా దృష్టికీ వచ్చింది. కానీ సమస్యను పరిష్కరించే అధికారం మాకు లేదు. సిఎస్‌డిటి, డిఎస్‌ఒలు చర్యలు తీసుకోవాలి.- మురళీకృష్ణ, ఎఒ, రేగిడి

➡️