నరసరావుపేట ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అలెగ్జాండర్‌ సుధాకర్‌

Apr 1,2024 23:11

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది అలెగ్జాండర్‌ సుధాకర్‌ను ఎఐసిసి ప్రకటించింది. 2013లో రాష్ట్ర విభజన అనంతరం అనేకమంది నాయకులు కాంగ్రెస్‌ను వీడారు. అయినా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న అలెగ్జాండర్‌ సుధాకర్‌ నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షునిగా, జిల్లాల విభజన అనంతరం పల్నాడు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా నియమితులయ్యారు. పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలనూ నిర్వహిస్తూ వస్తున్న ఆయన 2014, 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తరుపున నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై అలెగ్జాండర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ ఎఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాజధానికి నిధులు, పంటలకు మద్దతు ధరలు, పరిశ్రమల స్థాపన, యువతకు ఉద్యోగాలు వంటివి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

➡️