నష్టం మిగిల్చిన మిచౌంగ్‌ 

తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న అమలాపురం రూరల్‌ మండలం కామనగరవు సర్పంచ్‌

తుపాను ధాటికి జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం నీట మునిగింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. రహదారుల్లో పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దెబ్బతిన్న పంటలను బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

అమలాపురం : పట్టణం పరిధిలో 30 వార్డులలో ఉన్న ముంపు ప్రాంతాలను బుధవారం అమలాపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్ర మణి సత్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ అయ్యప్ప నాయుడు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టరు ఆదేశాలను అనుసరించి ముంపు ప్రాంతాలలోని బాధితులకు తాగునీరు, భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో డిఇ సిహెచ్‌.నాగసతీష్‌, ఎఇ వెంకటేష్‌, ఎఇ భాస్కర్‌ శానిటరీ సెక్రటరీలు, శానిటరీ మేస్త్త్రిలకు ముంపు ప్రాంతాల్లో తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి అమలాపురంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. అమలాపురం బస్టాండ్‌ వర్షం నీటితో పూర్తిగా నీట మునీగింది. ఆర్‌టిసి గ్యారేజ్‌ పూర్తిగా నీట ములగంతో ఉద్యోగులు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు కొన్నిచోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.డ్రైనేజీ వ్యవస్థ సరిలేక నీరు బయటకు వెళ్ళకపోవడంతో రోడ్లపై నీరు చేరి నిలిచిపోయి రోడ్లు మునిగిపోతున్నాయి.విరిగిన విద్యుత్‌ స్తంభాలు మండపేట తుపాను కారణంగా కురిసిన వర్షాలతో మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు, భారీ వర్షానికి మండపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో సుమారుగా 18 విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండపేట నుంచి ఏడిద రోడ్డులో సమీపంలో సుమారుగా భారీ చెట్టు విరిగిపోవడంతో ట్రాఫిక్‌ తీవ్ర అంతరం ఏర్పడింది. దెబ్బతిన్న తోటలు, పాదులుకొత్తపేట తుపాను ప్రభావంతో కొత్తపేట మండలంలో లంక గ్రామాల్లో అరటి తోటలు, కూరపాదులు, దుంప తోటలు దెబ్బతిన్నాయి. వరి రైతులు కల్లాలులో సైతం ధాన్యం తడిసి ముద్దయింది. ఎకరాకు ప్రతి రైతు రూ.30 వేల నుంచి 40 వేల వరకు నష్టపోయారని, ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాలని టిడిపి నాయకులు రైతు సంఘం తరఫున కోరారు. భారీ వర్షాలకు పలివెల మీడియం డ్రైన్‌ (గోరింకల డ్రైన్‌) వరదనీటి తీవ్రతకు ఉప్పొంగడం వలన ముంపునకు గురైన రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం, కొత్తపేట మండలం పలివెల గ్రామ శివారు పూజారిపాలెం గ్రామాల కుటుంబాలను చిర్ల పరామర్శించారు. తుపాను హెచ్చరికలు ముందస్తుగా వున్నా రైతులను ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్‌ బండారు సత్యానందరావు అన్నారు. అవిడి గ్రామంలో తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. 550 ఎకరాల్లో నీట మునిగిన వరి చేలు రామచంద్రపురం : భారీ వర్షాలకు కె.గంగవరం మండలంలోని 550 ఎకరాలు వరిచేలు నీట మునిగిపోయాయని, మాసూలు చేసి నిలువ చేసుకున్న ధాన్యం 2,800 మెట్రిక్‌ టన్నులు ధాన్యం నీట మునిగి ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి బి.రవి తెలిపారు. పామర్రు హైస్కూల్‌ వద్ద, కూళ్ళ గ్రామంలోనూ రైతన్నలు నిలవ చేసుకున్న ధాన్యం ముంపున గురైంది. మండలంలో మరో 1150 ఎకరాలు వరి కోత కోయాల్సి ఉందన్నారు. రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పంట పొలాలు భారీ వర్షాలకు నీట మునిగిపోయాయి. అయితే నీరు బయటకు పోవడానికి ఇబ్బందికరంగా ఉన్నచోట్ల జెసిబి ఏర్పాటుచేసి వర్షం నీరు బయటకు పోయేందుకు చర్యలు చేపట్టారు. వెంకటయ్యపాలెం సర్పంచ్‌ యల్లమిల్లి సతీష్‌ కుమారి. తహశీల్దార్‌ ఎం వెంకటేశ్వరరావు తో కలిసి సర్పంచ్‌ నీట మునిగిన పంట పొలాలను బుధవారం పరిశీలించారు. డ్రైనేజ్‌ లో, ఎస్‌సి కాలనీలో ఇళ్లల్లోకి చేరిన వర్షం నీటిని బయటికి వెళ్లేలా పంచాయతీ వర్కర్స్‌ తో డ్రైన్‌ ఏర్పాటు చేయించారు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాంఆలమూరు : తుపాను వలన నష్టపోయిన ప్రతీ రైతును, ఇళ్ళు దెబ్బతిన్న ప్రతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే చిర్ల పర్యటిస్తూ కురిసిన అధిక వర్షాల వలన నీటిలో మునిగిన వరి పొలాలను, ఇతర పంటలను బుధవారం పరిశీలించారు. తుపానుకు కారణంగా వచిన ఈదురుగాలులకు, భారీ వర్షాలకు మండలంలో ప్రత్యేకంగా చెప్పబడుతున్న ఇటుక బట్టి వ్యవస్థ కుదేలయ్యింది. దీంతో నిర్వాహకులకు భారీ ఎత్తున నష్ట వాటిల్లడంతో ఆవేదన చెందుతున్నారు. మండలంలోని వరి పంటలతో పాటు పూలు, పండ్ల తోటలు, ఉద్యాన, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మురుగునీరు మళ్లించేందుకు చర్యలుఅంబాజీపేట : తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గంగలకుర్రు లో నీట మునిగిన మెట్ల కాలనీ, సిద్ధార్థ నగర్‌, నెల్లివారిపేట కాలనీలలో మురుగునీరు ను సర్పంచ్‌ కాండ్రేగుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం మళ్ళించే చర్యలు చేపట్టారు. ఎంపిటిసి సభ్యులు నెల్లి ఏడుకొండలు, వార్డు సభ్యులు నాగప్రసాద్‌, జొన్నాడ కుమారి, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.సత్యవేణి లు పర్యటించి రోడ్లపై నిల్వ ఉన్న మురుగునీరు మళ్లించే చర్యలు కార్యక్రమం లో పాల్గొన్నారు. మిచౌంగ్‌ తుఫాను వల్ల నష్టపోయిన వారి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎంపిపి డివివి.సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పుల్లేటికుర్రు మరియు తదితర గ్రామాల్లో నీట మునిగిన ప్రాంతాలు పరిశీలించారు. నీట మునిగిన వరి పొలాలలో తక్షణమే మురుగునీరు మళ్ళించే చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు అన్నారు. కె.పెదపూడి, ఇసుకపూడి,చిరుతపూడి మరియు మాచవరం ఆయా గ్రామాలలో సర్పంచ్‌ లు మరియు ఎంపిటిసి లు,సొసైటీ చైర్‌ పర్సన్‌ లు ఆద్వర్యంలో జెసిబి ద్వారా వరి చేల నుండి మురుగునీరు మళ్ళించే చర్యలు బుధవారం చేపట్టారు. వరి పొలాల పరిశీలనఉప్పలగుప్తం : తుపాను కారణంగా భారీ వర్షాలకు ఉప్పలగుప్తంలో నీట మునిగిన వరి చేలు, నారుమడులను బుధవారం ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త బి.భవాని, జిల్లా వనరుల కేంద్రం ఎడిఎ ఎ.రాజశేఖర్‌, అమలాపురం ఎడిఎ ఎంఎ షంషీ, మండల వ్యవసాయ అధికారి జి.కుమార్‌ బాబు, తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి, జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, సర్పంచ్‌ ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని జనసేన నాయకులు డిఎంఆర్‌ శేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఉప్పు ద్రావణం స్ప్రే చేయాలిఅమలాపురం రూరల్‌ :తడిసిన ధాన్యాన్ని, తడిచిన పనల మీద 5శాతం ఉప్పు ద్రావణం స్ప్రే చేసి మొలక శాతం, ధాన్యం రంగు మారకుండా నివారించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు అన్నారు. బుధవారం కామనగరువు గ్రామంలో భారీ వర్షాలకు ముంపు బారిన పడిన వరి పొలాలను సర్పంచ్‌ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్‌ తో కలసి సందర్శించారు. భారీ వర్షాల కారణంగా అమలాపురం మండలం రెడ్డిపల్లిలో రాశులు పోసిన ధాన్యం సైతం తడిసి పోతుండటంతో సర్పంచ్‌ కరాటం రత్నప్రసన్న ప్రవీణ్‌ ఆధ్వర్యంలో రైతులు ఒడ్డుకు చేర్చుకున్నారు. బుధవారం నీట మునిగిన వరి చేలను అధికారులు పరిశీలించారు. తుపాను కారణంగా అరటి తోటలు, కూరపాదులు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని అమలాపురం రూరల్‌ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామ సర్పంచ్‌ పెద్దిరెడ్డి రాము అన్నారు. బుధవారం గ్రామంలోని నీట మునిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పలు గ్రామాల్లో .. ఆత్రేయపురం : జెడ్‌పిటిసి సభ్యులు బోనం సాయిబాబా, ఎంపిడిఒ నాతి బుజ్జి, ఆప్కాస్‌ డైరెక్టర్‌ కప్పల శ్రీధర్‌ తదితరులు ర్యాలి, వెలిచేరు, రాజవరం, పేరవరం ,నార్కెడ్మిల్లి తదితర గ్రామాలలో నీట మునిగిన పంటలను పరిశీలించారు. తుఫాను కారణంగా మండలంలోని పంట పొలాలు ధాన్యపు రాశులు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 500 ఎకరాలు పైనే వరి పంట నేలకొరిగింది వర్షపు నీరు ముందుకు వెళ్లే దారి లేక పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.మామిడికుదురు మండలంలో..మామిడికుదురు : పాశర్లపూడిలో ముంపునకు గురైన వరి చేలను బుధవారం పి.గన్నవరం నియోజకవర్గ టిడిపి టు మెన్‌ కమిటీ నామన రాంబాబు, అమలాపురం పార్లమెంట్‌ రైతు అధ్యక్షులు మట్ట ప్రభాకర్‌, మామిడికుదురు మండల అధ్యక్షులు మొల్లేటి శ్రీనివాస్‌, బోనం బాబు, పెదపట్నంలంక సర్పంచ్‌ సుందరంనీడి రాజేష్‌, కొమ్ముల నందిబాబులు పరిశీలించారు. పూర్తిగా నీట మునిగిన పంటకు ఎకరాకు 30వేలు నట్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వన్ని డిమాండ్‌ చేశారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బిజెపి మండల కమిటీ డిమాండ్‌ చేసింది. నీటమునిగిన పంటలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు మెండా ఆదినారాయణ, రాష్ట్ర కిసాన్‌ మోర్చా కార్యవర్గ సభ్యులు కంకిపాటి సుబ్బారావు, జిల్లా కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి వేగి వెంకటేశ్వరరావు. తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️