నాటు తుపాకీలు పోలీసులకు అప్పగింత

నాటు తుపాకీలు అప్పగించిన గిరిజనులకు ప్రోత్పాహం అందిస్తున్న సిఐ, ఎస్‌ఐ

ప్రజాశక్తి -సీలేరు :

జీకే వీధి మండలం రింతాడ పంచాయతీ పరిధి కొత్తబంధ గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన రైతులు తమ దగ్గరున్న మూడు నాటు నాటు తుపాకులను స్వచ్ఛందంగా శనివారం జికె.వీధి పోలీసులకు అప్పగించారు. దీంతో వారికి జికె.వీధి సిఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ అప్పలసూరి నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ సందర్భంగా సిఐ అప్పలనాయుడు మాట్లాడుతూ మిగిలిన గ్రామాల్లో గిరిజనులు కూడా స్వచ్ఛందంగా నాటు తుపాకీలు వారం రోజులు లోపు అందజేయాలని కోరారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️