నాసిరకంగా జాతీయ రహదారి పనులు

ప్రజాశక్తి – కొండాపురం మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. పనులు నాసిరకంగా చేపడుతున్నారనే ఆరో పణలు బలంగా విన్పిస్తున్నాయి. పనులు దక్కి ంచుకున్న కాంట్రాక్టర్‌ ఓ రాజకీయ నాయకుడు కావడంతో ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా మారింది. పైగా క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. జాతీయ రహదారి నిర్మాణానికి హార్డ్‌ మొరమ్‌ లేక హార్డ్‌ గ్రావెల్‌ ఉపయోగిస్తే ఎక్కువ కాలం రోడ్డు మన్నికగా ఉంటుంది. ఒక లేయర్‌కు 30 సెంటీ మీటర్లు ఎత్తు మట్టిని వేసి తగిన నీటిని వేసి 25 సెంటీమీటర్లు వచ్చే వరకు రోలింగ్‌ చేయాల్సి ఉంటుందని మేధావులు పేర్కొ ంటున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ మాత్రం స్థానికంగా లభించే సుద్ధమట్టిని ఉప యోగిస్తున్నారు. మట్టిని ప్రతి లేయర్‌కు 60 సెంటీమీటర్ల ఎత్తుకు నింపడం, కావాల్సిన నీటిని వదలకపోవడం, రోలింగ్‌ సరిగ్గా చేయక పోవడంతో పనులు నాసిరకంగా చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాంక్రీట్‌ పనుల్లో చెప్పలేనంత డొల్లతనం ఉందని, కల్వర్టులు, బ్రిడ్జిలు, డ్రెయినేజీల విషయంలో నిబంధనలు తుంగలో తొక్కి పనులు చేస్తున్నారని ప్రజలు వాపో తున్నారు. కాంక్రీట్‌ పనుల వద్ద నాసిరకం మెట ీరియల్‌ ఉపయోగిస్తున్నారని, కాంక్రీట్‌ వేసే సమ యంలో కనీసం వైబ్రేటర్లు కూడా ఉపయోగి ంచకుండా చేస్తున్నారని, పనులు వద్ద కనీస అర్హత కల్గిన అధికారులు కూడా ఉండటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జాతీయ రహ దారి ఏర్పాటు పేరుతో ప్రజాధనాన్ని పెద్దలకు దోచిపె ట్టడానికి పనులు చేస్తున్నారనే విమర్శ బలంగా విన్పిస్తోంది. జాతీయ రహదారి నాసిరకం పనులపై రెసిడెన్షి యల్‌ ఇంజినీరు అధికారి రవికుమార్‌ ఏమన్నారంటే.. జాతీయ రహదారి నంబర్‌ 67, కొండాపురం మండలంలో సి.ఆర్‌. అసోసియేషన్‌ చేస్తున్న పనుల్లో తమకు కావాల్సిన మేరకు నాణ్యతగా ఉందని, 100 మార్కులకు ప్రశ్నా పత్రమిస్తే 100 రాకపోయినా ఫర్వాలేదు కనీసం 35 మా ర్కులు వచ్చినా పాస్‌ చేయొచ్చని ఆయన ఉద హరించారు. కనీస పరిణా మాలుంటే చాలని అధికారి పేర్కొన్నారు. పైగా మీరు థర్డ్‌పార్టీ అధి కారులతో పరిశీలిం చుకో వచ్చని చెప్పారు. మరి ఈ రహదారి పనుల్లో 35 మార్కులొచ్చాయా లేక 100 మార్కులు వచ్చాయా అనే విషయం ఆ అధికారి చెప్పలేదు. అంటే థర్డ్‌పార్టీ ద్వారా పరిశీ లించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అధికారి చెప్పకనే చెప్పారు. జాతీయ రహదారి పనుల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారి ఉన్నత స్థాయి అధికారులు పరిశీలించి, నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️