నిత్యాన్నదానానికి రూ.50వేల విరాళం

దాతకుచిత్రపటం అందిస్తున్న సహాయ కమిషనర్‌మాధవి

ప్రజాశక్తి-మామిడికుదురు

అప్పనపల్లి బాలబాలాజీ శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌కు దాత శనివారం విరాళం అందజేశారు. వివరాలు ఇవి.. ఎన్‌టిఆర్‌ జిల్లా గొల్లపూడి వాసులు తాడేపల్లి భవాని జాపకార్థం కుటుంబ సభ్యులు హరిరావు ప్రతి ఏటా సెప్టెంబర్‌ 9న అన్నదానం జరిపిం చేందుకు బాలబాలాజీ శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.50,001 వేల విరాళం ఇచ్చారని ఆలయ సహాయ కమిషనర్‌ గ్రంది మాధవి తెలిపారు. దాతకు ఆలయ ఛైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, సభ్యులు చిట్టాల సత్తిబాబు, మద్దాలి తిరుమల శింగరాచార్యులు స్వామి వారి చిత్ర పటం, ప్రసాదం అందచేశారు.

 

 

➡️