నిబంధనల ఉల్లంఘన – చంద్రశేఖర్‌, మాధవిపై కేసు

Mar 22,2024 23:33

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరులో అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్పించినందుకు గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో టిడిపి లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి గల్లా మాధవి, నాయకులు కోవెలమూడి రవీంద్రపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా, సమాచారం ఇవ్వకుండా ప్రచారంలో పాల్గొని ట్రాఫిక్‌ అంతరాయం కల్గించినట్టు ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వీరితోపాటు మరికొంతమంది నాయకులపైనా కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 143, 341, 290, 188, 171, 149 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

➡️