నివారణ చర్యలు చేపట్టాలి

Feb 15,2024 20:20

ప్రజాశక్తి- సాలూరు : దోమల వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టి, జ్వరాలు ప్రభావితం కాకుండా చూడాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి. జగన్‌మోహనరావు సూచించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రి ల్యాబ్‌లను గురు వారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రతీ రోజూ ఎంతమంది రోగులు ఆరోగ్య తనిఖీల కోసం వస్తున్నారు, వారి ఆరోగ్య సమస్యల వివరాలను రికార్డులో తనిఖీ చేశారు. జ్వర లక్షణాలకు చేపడుతున్న నిర్దారణ పరీక్షలు, వాటి నివేదికలను ల్యాబ్‌ రికార్డులో పరిశీలించారు. దోమల ఆవాస ప్రదేశాలను గుర్తించి వెక్టార్‌ కంట్రోల్‌ హైజీన్‌ యాప్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. ఆ ప్రాంతంలో నివారణ చర్యలు చేపట్టాలని, డ్రైడే కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని, అందుకు సంబంధిత శాఖల సమన్వయం అవసరమని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు ఆరోగ్య సర్వే చేపట్టాలన్నారు. ప్రాంతీయ ఆసుపత్రి ల్యాబ్‌లో రికార్డులు పరిశీలించి జ్వరాల వివరాలు ఐహెచ్‌ఐపి పోర్టల్‌లో నమోదు చేయాలని, ఏ ప్రాంతానికి చెందినవీ తెలియజేయాలని సూచించారు. అనంతరం డాక్టర్‌ జగన్‌ మోహనరావు మున్సిపల్‌ కమిషనర్‌ పి. ప్రసన్నవాణితో సమీక్ష జరిపారు. దోమల వ్యాప్తి నివారణ చర్యలు, పారిశుధ్య కార్యకమాల అంశాలపై చర్చించారు. వీటిని మెరుగు పరిచే దిశగా ఆయా వార్డుల్లో సచివాలయ, వైద్య సిబ్బంది సమన్వయం అవసరమన్నారు. అనంతరం ఆయన కూర్మరాజు పేటలో హెల్త్‌ వెల్నెస్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, వైద్యాధికారులు డాక్టర్‌ సాయికిరణ్‌, డాక్టర్‌ ఎ.ప్రియాంక, సబ్‌ యూనిట్‌ అధికారి ఎం.ఈశ్వరరావు, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ కె.లక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సీతానగరం: హెల్త్‌ వెల్నెస్‌ కేంద్రాల్లో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్‌ మోహనరావు అన్నారు. గురువారం స్థానిక పిహెచ్‌సిలో క్షేత్ర స్థాయి సిబ్బందితో నిర్వహించిన సమావే శంలో ఆయన కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించిన అన్ని ఆరోగ్య కార్యక్రమాలను, వైద్య సదుపాయాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వినియో గించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో హెల్త్‌ వెల్నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఆరోగ్య తనిఖీల వివరాలు, నివేదికలు నిర్దేశిం చిన రికార్డుల్లో పక్కగా నమోదు చేయాలని ఆదేశించారు. జ్వర లక్షణాలు గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు జరపాలని, రక్త నమూనాలు సేకరించాలని సూచించారు. అనంతరం పిహెచ్‌సి ల్యాబ్‌లో కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసిన సిబిసి ఎనలైజర్‌ రక్త పరీక్షల పరికరం పనితీరును గమనించారు. కార్యక్రమ ంలో వైద్యాధికారి డాక్టర్‌ పావని, ఎఎంఒ సూర్యనారాయణ, సిహెచ్‌ఒ ఎస్‌వి రమణ, సూపర్‌వైజర్‌ భవాని, ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు, హెల్త్‌అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️