నులిపురుగుల నివారణకు చర్యలు

Feb 7,2024 20:30

ప్రజాశక్తి- డెంకాడ: నులిపురుగుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఎస్‌. భాస్కరరావు అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నులిపురుగల నివారణ ప్రచార పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలకు ఆల్బండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఈ నెల 9 నుంచి పాఠశాలలు, కళాశాలలో 1-19 సంవత్సరాల పిల్లలకు అల్బండజోల్‌ మాత్రలు మింగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ లవరాజు, డెంకాడ, మోపాడ పిహెచ్‌సిల వైద్యాధికా రులు డాక్టర్‌ రాజ్‌ కుమార్‌, డాక్టర్‌ యోగితా బాల, ఎంఇఒ వెంకటరమణ, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రేగిడి: మండలంలోని బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ వై చలమయ్య ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణకు గోడ పత్రికను బుధవారం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 9 నుంచి అంగన్వాడి, పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నులుపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరం నుంచి 2 ఏళ్ల లోపు అరమాత్ర, 3 నుంచి 19 ఏళ్ల వరకు ఒక మాత్ర వాడాలన్నారు. నులు పురుగులు ఉన్న పిల్లలలో శారీరక, మానసిక ఎదుగుదల ఉండకపోవడం, కిషోర్‌ బాలికల్లో పోషక ఆహారం లోపం, రక్తహీనత ఉంటుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ 1221మంది, పాఠశాలల్లో విద్యార్థులు 3,171 మంది పిల్లలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీరితో ఎంపిహెచ్‌ఇఒ రధాకృష్ణ, పిహెచ్‌ఎన్‌ సావిత్రి, సూపర్‌వైజర్‌ సాయికృష్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 9న డివార్మింగ్‌ డేఈ నెల 9న డివార్మింగ్‌ డే సందర్భంగా రేగిడి ఆరోగ్య కేంద్రం పరిధిలో నులిపురుగులు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వైద్యాధికారి డాక్టర్‌ అసిరి నాయుడు తెలిపారు. ఇప్పటికే హెల్త్‌ క్లినిక్ల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు.రామభద్రపురం: ఈ నెల 9న నిర్వహించే జాతీయ నులుపురుగుల దినోత్సవం (నేషనల్‌ డీ వార్మింగ్‌ డే) విజయవంతం చేయాలని స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి పిల్లి దిలీప్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక పిహెచ్‌సిలో బుధవారం ఆయన ఆయన మాట్లాడుతూ రెండు నుండి 19సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు, యువతకు నులి పురుగుల నివారణ మాత్రలైన ఆల్బెండజోల్‌ పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న 8 సచివాలయాల పరిధిలో గల 28 అంగన్వాడీ కేంద్రాలు, 26 ప్రభుత్వ పాఠశాలలు, 3 ప్రైవేటు పాఠశాలలు, 1 ప్రైవేటు కళాశాల లో చదువుతున్న సుమారు 4 వేల మంది విద్యార్థులకు ఒక్కొక్క మాత్ర పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామన్నారు. ఈ మాత్రలు మద్యాహ్నం భోజనం అనంతరం నమిలి మింగాలన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయాల ఆరోగ్య సహాయకులు, పాఠశాలలో సిబ్బంది విధిగా పాల్గొనాలని కోరారు. గైర్హాజరైన పిల్లలు ఉంటే వారిని గుర్తించి మరలా ఈ నెల 16న పంపిణీ చేస్తామని చెప్పారు. ఆరికతోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కూడా వీటి పంపిణీ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో హెల్త్‌ సూపర్వైజర్‌ వాసుదేవరావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️