నూతన పింఛన్ల పంపిణీ

ఆలమూరు మండల ం చొప్పెళ్లలో పింఛన్‌ అందజేస్తున్న ఎంపీపీ లక్ష్మణరావు, సర్పంచ్‌ చంద్రకళ తదితరులు

ప్రజాశక్తి-ఆలమూరు

పింఛన్‌ మొత్తం రూ.3 వేలకు పెంచిన సందర్భంగా చొప్పెల్ల పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్‌ దంగేటి చంద్రకళ బాపణయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ని ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, జెడ్‌పిటిసి సభ్యురాలు తోరాటి సీత మహాలక్ష్మి పాల్గొనిప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో జనవరి 2024 నుంచి 1023 మంది పాతవారికి, నూతనంగా మంజూరైన 10 మంది కొత్తవారికి రూ.3 వేల చొప్పున రూ.30,31,500లు అందజేయనున్నట్లు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి తోరాటి రాంబాబు, గ్రామ వైసిపి అధ్యక్షుడు వాసన రాజు, ఉపసర్పంచ్‌ తోరాటి దుర్గారావు, వైసిపి నేతలు జాంపోలు మాణిక్యం, జలగం వెంకన్న కార్యదర్శి ఎం.శ్యామ్‌ సుందరం, పలువురు నాయకులు, సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

 

➡️