నేడు గాలాయిగూడెంలో గవర్నర్‌ పర్యటన

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రకు హాజరు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ మంగళవారం ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయిగూడెంలో పర్యటించనున్నారు. ఉదయం 9.15 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 10.50 గంటలకు గాలాయిగూడెం చేరుకుంటారు. 11 గంటల నుంచి 12.40 గంటల వరకూ వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొంటారు. అనంతరం 12.45 గంటలకు గాలాయిగూడెం నుంచి తిరిగి రాజభవన్‌కు బయలుదేరతారు. గవర్నర్‌ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

➡️