నేడు యధావిధిగా స్పందన, డయల్ యువర్ కమిషనర్

Mar 3,2024 17:59 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె. వెంకటరావు చెప్పారు. నగర ప్రజలు స్థానికంగా ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులను కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఫోన్ నెంబర్ 0884 2357800 కు కాల్ చేసి తెలియజేయవచ్చునన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. అలాగే 10:30 నుంచి స్పందన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డయల్ యువర్ కమిషనర్,స్పందన కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ రాలేని ప్రజలు స్థానికంగా ఉండే సచివాలయాల్లో కూడా సమస్యలు తెలియజేయవచ్చునని కమిషనర్ సూచించారు.

➡️