నేడు వడ్లమూడికి చంద్రబాబు రాక

Jan 29,2024 00:13

ప్రజాశక్తి – చేబ్రోలు : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం మండలంలోని వడ్లమూడికి రానున్నారు. సంగం దాణ ఫ్యాక్టరీ వద్ద స్థలంలో రా కదలిరా సభలో ఆయనపాల్గొంటారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ – రా కదలిరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని చేబ్రోలుమండలంలో భారీ ఏర్పాట్లు చేశారు. బుడంపాడునుంచి అంగలకుదురు వరకు దారిపొడవునా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ, నాయకులు నాగుల్‌మీరా, కోవెలమూడి రవీంద్ర, బి.రామాంజనేయులు, జనసేన నాయకులు వడ్రాణం మార్కండేయులు, మన్నవ సుబ్బారావు పరిశీలించారు. ఈ సందర్భంగా దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ సభకు లక్షలాదిగా టిడిపి శ్రేణులు తరలివస్తాయని చెప్పారు. రెండు నెలల తర్వాత రాష్ట్రంలో ప్రజా పాలన వస్తుందని, అందుకు ప్రజలంతా సిద్ధహయ్యాని అన్నారు. ఇదిలా ఉండగా నారాకోడూరులోని యాదవ సమాజం, సర్పంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 110 అడుగుల విద్యుత్‌ ప్రభను ఏర్పాటు చేశారు.

➡️