నేడు స్టీల్‌ సిఐటియు ధర్నా

స్టీల్‌ సిఐటియు

ఉక్కు యాజమాన్యం, గుర్తింపు యూనియన్‌ వైఖరికి నిరసన

నేడు స్టీల్‌ సిఐటియు ధర్నా

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ కార్మికులకు హక్కుగా సంక్రమిస్తున్న సౌకర్యాలను కాలరాస్తున్న యాజమాన్య వైఖరికి మద్దతుగా గుర్తింపు యూనియన్‌ సహకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విశాఖ స్టీల్‌ జనరల్‌ హాస్పిటల్‌ వద్ద స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్‌, ప్రధాన కార్యదర్శి యు రామస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్లాంట్‌లో సిఎంఎస్‌ వద్ద స్టీల్స్‌ సిఐటియు ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం నిర్వహించారు.సమావేశంలో జె అయోధ్యరామ్‌, యు రామస్వామి మాట్లాడుతూ స్టీల్‌ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపై గుర్తింపు యూనియన్‌ స్పందించకపోవడం కార్మిక ద్రోహానికి చిహ్నమని మండిపడ్డారు. స్టీల్‌ యాజమాన్యం, గుర్తింపు యూనియన్‌ వైఖరులకు వ్యతిరేకంగా కార్మికులను సమాయత్తం చేసి ప్రతిఘటిస్తామన్నారు.కార్మికుల వైద్యఆరోగ్య సమస్యలపై యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఫ్యాక్టరీలో పనిచేయడం వల్లే కార్మికులకు కలిగే అనారోగ్య సమస్యలకు బాధ్యత వహించాల్సిన యాజమాన్యం పట్టనట్లు వ్యవహరిస్తే ఒప్పుకునేది లేదని, దీనిపై రాజీలేని పోరాటం తప్పదన్నారు. యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పదని హెచ్చరించారు.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్‌ మాట్లాడుతూ యాజమాన్యం బాధ్యతలను విస్మరించి, ౖ క్రమశిక్షణ పేరుతో కార్మికులపె చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాలన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల16న రుతో 547 కర్షక సంఘాలు, 11 జాతీయ కార్మిక సంఘాలు అనేక ఫెడరేషన్లు తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో స్టీల్‌ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, నీలకంఠం, గంగాధర్‌, కష్ణమూర్తి, మరిడయ్య, మహేష్‌, బి ఎన్‌ మధుసూదన్‌, కె ఆర్‌ కె రాజు, వి డి వి పూర్ణచంద్రరావు, శ్రీనివాస్‌, ఎం ఎస్‌ వి ఉమామహేశ్వరరావు, మొహిద్దిన్‌, సూర్యనారాయణ, సత్యనారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, వి ప్రసాద్‌, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి రామస్వామి

➡️