నేలకు ఒరిగిన భారీ వృక్షం- వ్యక్తికి తీవ్ర గాయాలు

Mar 3,2024 21:12

ప్రజాశక్తి- రేగిడి/రాజాం : రాజాం మున్సిపాలిటీ బొబ్బిలి సెంటర్‌లో మసీదు వద్ద ఉన్న భారీ వృక్షం ఆదివారం సాయంత్రం కూలిపోయింది. దీనివల్ల రాజాం టౌన్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. చెట్టుకూలిన సమయంలో కొండం పేటకు చెందిన శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంతో వెళ్లడంతో అతనిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో అతని తలకు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. అతని ద్విచక్ర వాహనం చెట్టు కింద ఇరుక్కుపోయింది. ఈ ఘటన తెలిసిన వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ రామప్పలనాయుడు తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. చీపురుపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా మళ్లీంచారు. సుమారు 2 గంటలు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

➡️