నోటీసులకు అంగన్‌వాడీల రిప్లై

నోటీసులకు అంగన్‌వాడీల రిప్లై

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరుకుంది. వారి సమ్మెకు పలువురు సంఘీభావం తెలిపారు. కోటి సంతకా సేకరణలో భాగంగా పలువురు మద్దతుగా సంతకాలు చేశారు. అమలాపురం కలెక్టర్‌ కార్యాలయం వద్ద దీక్షా శిబిరాన్ని పలువురు నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సమ్మె శిబిరంలో విజయ, రత్నకుమారి, మణిమాల, దైవకృప, బేబీ గంగారత్నం, ఐసిడిఎస్‌ ప్రాజెక్టుకు పరిధిలోని అంగన్‌డీ టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు.మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు సందర్శించిన మద్దతు తెలిపారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆయన సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడిలు పాల్గొన్నారు. మామిడికుదురు తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు బెలూన్లతో నిరసన తెలిపారు.రామచంద్రపురం 3వ రోజు సంతకాల సేకరణ చేపట్టారు. అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణవేణి, సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరామ్‌ మాట్లాడుతూ ఎటువంటి నోటీసులకైనా, ఎస్మాలకైనా భయపడేది లేదని, న్యాయమైన డిమాండ్స్‌ కోసం ఎన్ని రోజులైనా సమ్మెలో కొనసాగుతామని స్పష్టం చేశారు. అనంతరం ర్యాలీగా ఐసిడిఎస్‌ కార్యాలయానికి వెళ్లి షోకాజ్‌ నోటీసులకు సమాధానాలు రాసి సిడిపిఓ వరహాలక్ష్మికి అంద చేశారు. ఈ సమ్మెలో ఎం.దుర్గమ్మ, వాసంశెట్టి సూర్యకుమారి, విజయలక్ష్మి, శ్రీదేవి, జహరాదుర్గ, వెంకటరత్నం, గొంతిదేవి, వీరవేణి పాల్గొన్నారు.ముమ్మిడివరం ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇచ్చి నిరసన కొనసాగించారు. జయలక్ష్మి, దుర్గా మల్లేశ్వరి ఆధ్వర్యాన సమ్మె శిబిరం నుంచి ప్రాజెక్ట్‌ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి ఐసిడిఎస్‌ అధికారులకు షోకాజ్‌ నోటీస్‌లకు సమాధానం ఇచ్చారు. అనంతరం జగనన్నకు చెబుదాం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి సంటకల సేకరణ చేపట్టారు. దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ధనలక్ష్మి, జి.శ్రీదేవి, జి.మంగాయమ్మ, వి.తలుపులమ్మ, ఎన్‌.విజయ కుమారి, కె.సత్యవతి, సుబ్బలక్ష్మి, హైమావతి, విజయ రత్న కుమారి, అంజనీదేవి, కనక దుర్గ పాల్గొన్నారు.

➡️