న్యాయసేవాధికార సంస్థలో న్యాయ విజ్ఞాన సదస్సు

Feb 20,2024 21:39

మాట్లాడుతున్న పివి రాంంబాబు
ప్రజాశక్తి-గుంటూరు : క్యాలెండరు యాక్టివిటీస్‌లో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ప్రపంచ సామజిక న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి మాట్లాడుతూ పౌరులందరూ సామజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ శాఖలు తమ శాఖాపరమైన ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తెలియచేశారు. ఈ సందర్భంగా పర్మినెంట్‌ లోక్‌అదాలత్‌ చైర్మన్‌ పి.వి.రాంబాబు మాట్లాడుతూ కక్షిదరులందరూ లోక్‌అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని తెలియచేశారు. ఈ సందర్భంగా ప్రపంచ సామజిక న్యాయదినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ప్రపంచ సామజిక న్యాయ దినోత్సవం ముఖ్య ఉద్దేశం పేదలకు, బలహీనవర్గాలకు సమన్యాయం కలిగి ఉండాలని ప్రభుత్వం అందించే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వ శాఖలు కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్మనెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పి.వి.రాంబాబు, జిల్లా ప్రొబేషన్‌ అధికారి బి.ఎ.సత్యనారాయణ, కలెక్టర్‌ ఆఫీసు సూపరింటెండెంట్‌ యం.లక్ష్మయ్య, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️