పంచాయతీల స్వయం సమృద్ధికి పెద్ద పీట

ప్రజాశక్తి- కడప ప్రతినిధి పంచాయతీల స్వయంసమృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. ఎస్‌డబ్య్లుపిసి నిధులు మొదలుకుని 15 ఫైనాన్స్‌ నిధుల వినియోగం, సకాలంలో పన్నుల సేకరణపై దృష్టి సారించాం. ఫలితంగా జిల్లాలోని 557 పంచాయతీల్లో పారిశుధ్యం మొదలుకుని పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించి ప్రజా రోగ్యాన్ని పెంపొందిస్తాం. ఉపాధి హామీ నిధుల సాయంతో పంచాయతీల్లోని గృహాలు మొద లుకుని రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలను పెంచడంతో పచ్చదనాన్ని పరుస్తాం. దీంతోపాటు స్వమిత్ర పథకం కింద పంచా యతీల్లో ప్రజల స్థిరాస్తుల గణన ద్వారా శాశ్వత హక్కులు కల్పించే విధంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టడమైందని పేర్కొంటున్న జిల్లా పంచాయతీ అధికారి డి.ప్రభాకర్‌రెడ్డితో ముఖాముఖి… పంచాయతీల అభివృద్ధి తీరుతెన్నులను వివరించండి? పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేశాం. ఉపాధి హామీ పనుల సాయంతో పంచాయతీల పరిధిలోని 2,246 గ్రామాల్లోని ఇళ్లు, రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. 15వ ఫైనాన్స్‌ నిధుల వినియోగం ద్వారా పారిశుధ్యాన్ని పెంపొందిస్తాం. ఎస్‌డబ్య్లుపిసి ప్లాంట్ల సాయంతో సాలిడ్‌ వేస్ట్‌ వేనేజ్‌ వ్యవస్థ ద్వారా చెత్తా చెదారాన్ని సేకరించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీ ఖాతాల్లో జమ చేయడం, వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేసి సరసమైన ధరలకు రైతులకు విక్రయిస్తాం. తద్వారా భూ కాలుష్యాన్ని నియంత్రించే పంటలు వృద్ధి చెందే ప్రయత్నం జరుగుతోంది. పంచాయతీ వివరాలు తెలపండి? జిల్లాలో 557 పంచాయతీలున్నాయి. ఇందులో వేంపల్లి, నందిమండలం, చెన్నూరు, ఖాజీపేట, కొత్తపల్లి, గోపవరం, పోరుమామిళ్ల, రంగసముద్రం మేజర్‌ పంచాయ తీలున్నాయి. జిల్లా పంచాయతీల పరిధిలో 2,246 గ్రామాల ున్నాయి. జిల్లాలోని పంచాయతీల నిర్వహణను 427 సచివాలయాల పరిధిలో 527 మంది కార్యదర్శులు పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.జగనన్న స్వచ్ఛసంకల్పాన్ని వివరించండి? జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా డైలీ క్లాప్‌ మిత్రలు ఇంటింటికీ తిరిగి తడిపొడి చెత్తలను వేరు చేసి పొడిచెత్తలోని గాజుముక్కలు, ప్లాస్టిక్‌వ్యర్థాలను సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూపంలో సంపదను సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఎస్‌డబ్య్లుపీసీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తాం. కొన్ని మేజర్‌ పంచాయతీల్లో వచ్చే అధిక ఆదాయాన్ని క్లాప్‌మిత్రలకు వేతన రూపంలో సర్దుబాటు చేయడానికి అవ కాశం ఉంటోంది. ఇటీవల కొంతమంది క్లాప్‌మిత్రల ఖాతాల్లో రూ.ఆరు వేలను జమ చేయడం జరిగింది.ఎల్‌డబ్య్లుఎం కార్యకలాపాల గురించి చెప్పండి? లిక్విడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్‌డబ్య్లుఎం)లో భాగంగా పంచాయతీల్లోని నీటి వృథాను అరికట్టడం, డ్రెయినేజీ క్లీనింగ్‌, డ్రెయినేజీ బ్లాకింగ్‌, వాటర్‌ స్టాగేషన్‌ ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్‌ వేయడం ద్వారా దోమల వ్యాప్తిని నిరోధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం.పారిశుధ్య నిర్వహణ చర్యలేమిటి? జిల్లాలోని 557 పంచాయతీల పరిధిలోని 2,246 గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు 626 పారిశుధ్య నిర్వహణ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 525 పారిశుధ్య కేంద్రాల్లో 1301 క్లాప్‌మిత్రలు, 1304 ట్రైసై కిళ్ల సహాయంతో పారిశుధ్య చర్యలు చేపట్టడం జరిగింది.ఓడిఎఫ్‌ ఫ్లస్‌ అంటే ఏమిటి? ఓడిఎఫ్‌ ప్లస్‌ అంటే ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ అని అర్థం. జిల్లాలోని 557 పంచాయతీల వారీగా అమలుకు గట్టి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులకు ఇరువైపులా మలవిసర్జన నివారణకు కృషి జరుగుతోంది. తక్కువ సమయంలో ఇటువంటి వ్యర్థాల నివారణపై అవగాహన కల్పించే కృషి ఊపందుకుంది.స్వమిత్ర పథకం తీరుతెన్నుల గురించి తెలపండి? స్వమిత్ర పథకం కింద పంచాయతీల పరిధిలోని ఆయా రెవెన్యూ గ్రామాల ప్రజలకు సంబంధించిన స్థిరాస్తుల వాణిజ్యీకరణ ఊపందుకుంది. సంబధిత పథకం కింద ఆయా గ్రామాల్లో డ్రోన్‌ సర్వే ద్వారా ప్రజల ఆస్తులను గణిస్తారు. అనంతరం సంబంధిత ఆస్తులకు మార్కెట్‌ విలువను జోడించడం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల ఆస్తులకు రిజిస్ట్రేషన్‌ సదుపాయం కల్పన ద్వారా భద్రత కల్పించ డం జరుగుతుంది.స్వమిత్ర పథకం సర్వే ఎలా సాగుతోంది? స్వమిత్ర సర్వే ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలోని 731 రెవెన్యూ గ్రామాల పరిధిలో 625 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్‌ సర్వే చేపట్టనున్నాం. ఇందులోభాగంగా 188 గ్రామాల్లో మ్యాపు-1 పిపిఎంఎస్‌ను తీయడమైంది. ఇందులో 113 ఇళ్లు, ఇళ్ల స్థలాలను గుర్తించడమైంది. ఇందులో 147 మ్యాప్‌-2 పిపి ఎంఎస్‌ తీయడమైంది. ఇందులో 93 భూ ఆధారిత గుర్తింపు ప్రక్రియల్ని పూర్తి చేయడమైంది.17 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్‌ సర్వే ద్వారా పూర్తి స్థాయి సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 72 గ్రామాల్లో ఆస్తుల డ్రా ప్ట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడమైంది.

➡️