పండగపూట పంగనామాలేనా.?

Jan 9,2024 21:17

ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన సమ్మె మంగళవారం నాటికి 15వ రోజుకు చేరింది. ప్రభుత్వం ప్రస్తుతం పారిశుధ్య కార్మికులకు చెల్లిస్తున్న జీతం రూ.15వేలు, ఆరోగ్య భృతి రూ.6వేలు కలిపి రూ.21వేలు జీతంగా ఇస్తామని, ఇదే ఎక్కువ అనే విధంగా మంత్రులు మాట్లాడుతున్నారని యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జగన్మోహన్‌రావు, నాయకులు కుమారి, రాఘవ మండిపడ్డారు. ఎన్నికల ముందు లక్ష రూపాయలు జీతం ఇచ్చిన తక్కువేనని, పర్మినెంట్‌ చేస్తామని చెప్పి, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి ఇప్పుడు అమలు చేయకుండా మున్సిపల్‌ కార్మికులకు పంగ నామాలు పెట్టి, చెవిలో పువ్వులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ.21 వేలకు అదనంగా మరొక రూ.3వేలు పెంచి రూ.24 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాటర్‌ వర్క్స్‌, పంపు హౌస్‌ కార్మికులకు బేసిక్‌ వేతనం రూ.21 వేలు అమలు చేయాలని కోరుతున్నామని ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె శిబిరంలో సూరి, గౌరీ, రమణ, వెంకట్‌, రమా, లక్ష్మి, ఈశ్వరమ్మ, వంశీ పాల్గొన్నారు.బిక్షాటన చేసిన మున్సిపల్‌ కార్మికులుఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మున్సిపల్‌ కార్మికులు భిక్ష వేయండి అని నినాదాలు చేసుకుంటూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి గంట స్థంభం మీదుగా ప్రతి దుకాణాలకు వెళ్లి బిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌, క్లాప్‌ వెహికల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ, యూనియన్‌ నాయకులు తుపాకుల శ్రీను, కళ్యాణ శ్రీను, దశమంతుల గణేష్‌, చిరంజీవి, సత్తిబాబు, యర్రంశెట్టి నాని, బండి రాము, సబ్బవరపు రామియమ్మ తదితరులు పాల్గొన్నారు.నెల్లిమర: స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారం కొనసాగింది. జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కిల్లంపల్లి రామారావు, కార్మికులు పాల్గొన్నారు.హామీలు అమలు చేయకపోతే పంగనామంబొబ్బిలి: కాంట్రాక్టు కార్మికులకు పాదయాత్ర, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పంగనామం పెట్టడం ఖాయమని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు సిఎం జగన్మోహన్‌రెడ్డిని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మున్సిపల్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికులు పంగనామాలతో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని పాదయాత్ర, ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చిన్నప్పటికి అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. హామీలను అమలు చేయకపోతే ఎన్నికల్లో మీకు పంగనామం పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గౌరీష్‌, వాసు, యుగంధర్‌, ప్రసాద్‌, కార్మికులు పాల్గొన్నారు.రాజాం: మున్సిపల్‌ కార్మికులకు జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులకు పంగనామాలు పెట్టడాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తి నాయుడు రాజాంలో జరిగిన నిరసన కార్యక్రమంలో తీవ్రంగా విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే ఆర్థికపరమైన అంశాలు ఇప్పుడు అమలు చేయలేమని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో హామీ ఇచ్చినప్పుడు అమలు చేయగలమో చేయలేమో అని ఇంకిత జ్ఞానం కూడా జగన్మోహన్‌ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. హామీలను అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకపోతే ఈ సమ్మె పోరాటం హామీలు అమలయ్యే వరకు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌, హరి, కృష్ణ శారద, మరియ దాస్‌, అప్పలరాజు, రమణ, లక్ష్మి, గురువులు, రాంబాబు, వెంకటి, సింహాచలం, గోపి, కృష్ణ, రాజేష్‌, కనకరాజు, గిరిబాబు,తదితరులు పాల్గొన్నారు

➡️