పండగలోనూ ఆగని పోరాటం

Jan 16,2024 22:19

ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీల హక్కుల సాధన కోసం దీక్ష చేపట్టి మంగళవారానికి 36వ రోజు అవుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో దీక్షా శిబిరం వద్ద వినూన్నత రీతిలో గంగిరెద్దుకు తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ల జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమార్‌, ప్రాజెక్టు కార్యదర్శి జె.సరోజ, సెక్టర్‌ లీడర్లు ఎం. మీనాక్షి, డివి రత్నం, బి. జయలక్ష్మి, ఎస్‌. సులోచన, డి. జ్యోతిలక్ష్మి, ఎన్‌. సుమతి తదితరులు పాల్గొన్నారు.సీతంపేట: స్థానిక ఐటిడిఎ ఎదుట సోమవారం అంగన్‌వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా తీపి వంటకాలు చేసి నిరసన తెలిపారు. ఆదివాసీ గిరిజన సంఘం సీనియర్‌ నాయకులు పాలక సాంబయ్య సమ్మెకు సంఘీ బావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విఒఎ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైన అంగన్వాడీ సంఘంతో చర్చలు జరిపి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు కోలాటం ద్వార నిరసన తెలిపారు. సమ్మె శిబిరంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు సురేష్‌, ఎం.కాంతారావు, ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, అంజలి, ప్రియ, అయెవతి, కుమారి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.సీతానగరం: మండల కేంద్రంలో 36వ రోజు అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. పండగ పూట కూడా కుటుంబ సభ్యులను బంధువులను ఇంటి వద్ద విడిచిపెట్టి అంగన్వాడీలు సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ కార్య క్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గవర వెంకటరమణ, అంగన్వాడీ యూనియన్‌ నాయుకులు మరిచర్ల సునీత, అనురాధ, కుమారి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌: ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరితే అంగన్వాడీ ఆడపడుచులకు పండుగను దూరం చేసిన గుండె లేని బండరాయి ప్రభుత్వమని జిల్లా అంగన్వాడీల యూనియన్‌ కార్యదర్శి గంట జ్యోతి, సిఐటియు నాయకులు గొర్లి వెంకటరమణ, వాకాడ ఇందిరా, అంగన్వాడి నాయకులు రాజేశ్వరి, గౌరీ, మని అన్నారు. తమ డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా 36వ రోజు మంగళవారం పార్వతీపురం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంక్రాంతి, కనుమ పండగలను లెక్కచేయకుండా నిరసన శిబిరాన్ని కొనసాగించారు. ప్రోజెక్ట్‌ లీడర్స్‌ గౌరీ మణి, అలివేలు అధ్వర్యంలో సంక్రాంతి పిండి వంటలు చేశారు. ఈసందర్భంగా అంగన్వాడీ సమ్మె శిబిరాన్ని స్ధానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు సందర్శించగా, వారికి నాయకులు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి సమ్మె పరిష్కారానికి చర్చలకు పిలవాలని కోరుతూ వినతి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమ్మె విరమించాలని అంగన్వాడీలను కోరారు. జీతాల పెంపు అంశాలపై జీవో ఇస్తే సమ్మె విరమిస్తామనీ అంగన్వాడీలు, సిఐటియు నాయకులు ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు పాలక రంజిత్‌ కుమార్‌, సెక్టార్‌ లీడర్స్‌ కే.రాజేశ్వరి, బి.శాంతి, ఎమ్‌.గౌరీ, సరస్వతి, కవిత, నాగ సులోచన తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: డిప్యూటీ సీఎంసాలూరు: అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ సీఎం రాజన్నదొర హామీ ఇచ్చారు. ఆదివారం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆద్వర్యాన కార్యకర్తలు హెల్పర్లు డిప్యూటీ సీఎం రాజన్నదొరని ఆయన నివాసంలో మంగళవారం కలిసి సమస్యలు వివరించారు. గుంజీలు తీస్తూ నిరసన: 36వరోజు సమ్మెలో భాగంగా సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరసన శిబిరం వద్ద గుంజీలు తీస్తూ నిరసన వ్యక్తం చేశారు. యూనియన్‌ నాయకులు ఎ.నారాయమ్మ, శశికళ అద్వర్యాన కార్యకర్తలు హెల్పర్లు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తిరుపతమ్మ, సుభద్ర, సుజాత పాల్గొన్నారు.కొమరాడ: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేస్తున్న సమ్మె 36వ రోజు మండల కేంద్రంలో జరిగింది. మంగళవారం 36వ రోజు క్రిస్మస్‌ ప్రార్థన పాస్టర్‌ ద్వారా టెంటలో చేస్తూ అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు అరటిపళ్ళు బూరెలు తినిపిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సిరిక అనురాధ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ అంగన్‌వాడీలు తమ సమ్యలను పరిష్కరించేంత వరకూ పోరాటం చేస్తారన్నారు. పండగ పూట కూడా పోరాటం చేస్తున్నారంటే వారి సమస్య ఎంత తీవంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టర్‌ లీడర్లు అలివేలు, జ్యోతి, పద్మ, జయమ్మ, మల్లేశ్వరమ్మ, విస్తరాని, ఎస్‌ రాధా, ఎస్‌ వసంత, బి భవాని, బి రాణి, ఎం కాంతమ్మ, సుజాత, కొమరాడ మండల తెలుగు రైతు అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు బత్తిలి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు ఏ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️