పకడ్బంధీగా కుష్టువ్యాధి సర్వే చేపట్టాలి

Dec 22,2023 20:35
ఫొటో : మాట్లాడుతున్న గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్‌ ఎం.శివకల్పన

ఫొటో : మాట్లాడుతున్న గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్‌ ఎం.శివకల్పన
పకడ్బంధీగా కుష్టువ్యాధి సర్వే చేపట్టాలి
ప్రజాశక్తి-ఉదయగిరి27వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు ఇంటింటి కుష్టువ్యాధి గుర్తింపు సర్వేను పకడ్బంధీగా వేగవంతం చేయాలని గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్‌ ఎం.శివకల్పన పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సిహెచ్‌సి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఎల్‌.సి.డి.సి సర్వేపై ఎ.ఎన్‌.ఎం.లు, ఆశా కార్యకర్తలు 27వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు ఇంటింటి కుష్టువ్యాధి గుర్తింపు సర్వేపై గండిపాలెం వైద్యాధికారిని డాక్టర్‌ ఎం.శివ కల్పన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా కార్యకర్త వలంటీర్‌ ఒక టీముగా ఏర్పాటు చేసుకొని ప్రతి గృహాన్ని సందర్శించి మహిళా పురుషులు శరీరంపై ఎటువంటి మచ్చలు ఉన్ననూ ఆశా కార్యకర్తలు గుర్తించి, వారిని పరీక్ష నిమిత్తం పి.హెచ్‌.సి, గండిపాలెంకు తీసుకువచ్చి వైద్యం అందించాలన్నారు. మండల వారీగా 25బృందాలు ఏర్పాటు చేసి 12మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఆశాలు ఇంటింటికి తిరిగి గుర్తించిన అనుమానిత కుష్టువ్యాధి వివరాలను రిపోర్టు రూపంలో మూడు గంటలలోపు పి.హెచ్‌.సి.కి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డి.పి.ఎం.ఒ, ఎస్‌.నాగరాజు, సి.హెచ్‌.ఒ శివకుమారి, ఆరోగ్య విద్యాధికారి కలసపాటి.వెంకటసుబ్బయ్య, ఎ.ఎన్‌.ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️