పట్టాలను ఆన్‌లైన్‌ చేయాలని ధర్నా

Feb 5,2024 21:11

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : మండలంలో వెలగవలస, ఎల్‌డి వలస, సంధి వలస గ్రామాలకు చెందిన గిరిజన రైతుల డి పట్టాలను ఆన్‌లైన్‌ చేయాలని సోమవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు పి. రాము మాట్లాడుతూ 1993లో 35 మంది గిరిజన రైతులకు డి పట్టాలు ఇవ్వడంతో వారు సాగు చేస్తున్నారన్నారు. సాగు చేస్తున్న డి పట్టా భూములకు ఆన్‌లైన్‌ చేయకుండా అదే భూములో కొండపోడు పట్టాలు ప్రభుత్వం ఇవ్వడం అన్యాయ మన్నారు. అదే గ్రామాల్లో మరో 45 మంది గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా కాలయాపన చేయడం గిరిజను లకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఈ సమస్యలపై రెండేళ్లుగా పది దపాలు గ్రీవెన్స్‌కు వినతి పత్రాలు అందజేసినా అధికారులు పరిష్కరించలే దన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన రైతులకు ఉన్న డీ పట్టాలను ఆన్‌లైన్‌ చేస్తూ, డి పట్టా లేని రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టి కృష్ణయ్య, జి సింహాచలం, బి అప్పలస్వామి, ఈఎం ముళ్ళు, గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు.

➡️