పథకాలపై ప్రచారం

ప్రజాశక్తి -మద్దిపాడు : మండల పరిధిలోని ఇనమనమెళ్ళూరు గ్రామంలో బాబుష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి సంతనూతలపాడు నియోజక వర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌. విజరుకుమార్‌ ఇంటింటికీ తిరిగి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మండవ జయంత్‌ బాబు, ఆడాక స్వాములు, గ్రామ అధ్యక్షుడు నైనాల భావన్నారాయణ, యూనిట్‌ ఇన్‌ఛార్జి దొప్పా శేషయ్య, మాజీ ఎంపిటిసి మందపల్లి శ్రీను, బూత్‌ ఇన్‌ఛార్జి దొప్పా సుబ్బారావు, భీమవరపు శ్రీనివాసరావు, ఉప్పుగుండూరి వీరాంజనేయులు, గంగవరపు ప్రసన్న కుమార్‌, గంగోలు శ్రీను, గంగవరపు జోసఫ్‌ ,జనసేన మండల అధ్యక్షుడు బాల సుబ్రహ్మణ్యం, జనసేన గ్రామ అధ్యక్షుడు గుద్దేటి సురేష్‌ బాబు పాల్గొన్నారు.కొండపి : మండల కేంద్రమైన కొండపిలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఇంటింటికీ తిరిగి టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నన్నూరి సుబ్బరామయ్య, ఆర్‌ఎంపి రాము, ఆద్దెపల్లి శ్రీను, కాశయ్య, యూత్‌ అద్యక్షుడు కాలేషా పాల్గొన్నారు.

➡️