పదవ తరగతి మోడల్‌ పేపర్ల ఆవిష్కరణ

ప్రజాశక్తి – కడప అర్బన్‌ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ప్రచురించే పదవ తరగతి మోడల్‌ పేపర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం కడప యుటిఎఫ్‌ భవన్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి పాళెం మహేష్‌ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుటిఎఫ్‌ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మాత్రమేగాక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శ్రేయస్సును దష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాదీ మోడల్‌ పేపర్ల ప్రచురణ నిర్వహిస్తుందని మోడల్‌ పేపర్ల రూపకల్పనలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రూపొందించబడి అతి తక్కువ ధరకు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థుల కోసం రూ.75 కే అన్ని సబ్జెక్టులు ఉండే విధంగా తయారుచేసి అందిస్తున్నామని తెలిపారు. ఈ మోడల్‌ పేపర్‌ ప్రాధాన్యతను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ సైతం ప్రశంసిస్తూ యుటిఎఫ్‌ విద్యార్థుల శ్రేయస్సుకు తన వంతు పాత్ర వహించడం ఎంతో ఆనందదాయకమైన తెలిపారు. గత సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల్లో యుటిఎఫ్‌ రూపొందించిన మోడల్‌ పేపర్లలోని ప్రశ్నలు 80 శాతం పైగా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. ఈ మోడల్‌ పేపర్లు కావలసినవారు కడప యుటిఎఫ్‌ భవన్‌లో, 9492805708లలో సంప్రదించగలరని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు సహాధ్యక్షురాలు సుజాత రాణి రాష్ట్ర కౌన్సిలర్‌ రూతు ఆరోగ్యమేరి జిల్లా కార్యదర్శి ఏజాస్‌ అహ్మద్‌ ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌ నాయకులు బాబు,అనిల్‌ కుమార్‌,శివశంకర్‌ రెడ్డి, వీరనారాయణ, గోపీనాథ్‌ పార్థసారథి, జి వెంకటసుబ్బయ్య కిరణ్‌ బాబు, కరిముల్లా, శివ వరప్రసాద్‌, మహబూబ్‌ బాషా పాల్గొన్నారు.

➡️