‘పదినెలలుగా జీతాల్లేవు’

ఈపూరు: పది నెలలుగా జీతాలు లేక పారిశుద్ధ్య కార్మికుల జీవనం కష్టంగా మారిందని, పెండింగ్‌ జీతాలను వెంటనే చెల్లిం చాలని స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వ ర్యంలో కార్మికులు గురువారం నిరసన చేశారు.ఈ సంద ర్భంగా బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీలో నిధులు ఉన్నప్పటికీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కుంటి సాకులు చూపుతూ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారన్నారు.ఎంపీడీవో స్పందించి జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో మండల సిపిఐ నాయకులు సత్యానందం, రామారావు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

➡️