పలువురు అధికారుల బాధ్యతలు స్వీకరణ

Feb 1,2024 20:26

ప్రజాశక్తి-చీపురుపల్లి : చీపురుపల్లి నూతన ఎంపిడిఒగా డి.స్వేత గురువారం బాధ్యతలు చేపట్టారు. చీపురుపల్లి ఎంపిడిఒగా పని చేసిన జి గిరిబాల శ్రీకాకుళం జిల్లాకు బదిలీ పై వెల్లారు. ఆమె స్థానంలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ఎంపిడిఒగా పనిచేసిన స్వేత చీపురుపల్లి వచ్చారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ అధికారులు, సిబ్బంది ఎంపిడిఒని కలసి శుభాకాంక్షలు తెలిపారు.రామభద్రపురం ఎంపిడిఒగా ఈశ్వరమ్మరామభద్రపురం: రామభద్రపురం నూతన ఎంపిడిఒగా ఈశ్వరమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నుంచి బదిలీల్లో భాగంగా ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన రమామణి వైజాగ్‌ జిల్లా చోడవరం బదిలీపై వెళ్లారు. ఈమెకు మండల పరిషత్‌ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిడిఒగా లవరాజు బాధ్యతలు స్వీకరణ డెంకాడ: ఇక్కడ పనిచేసిన ఎంపిడిఒ డిడి స్వరూపారాణి ఇటీవల శ్రీకాకుళం బదిలీ కావడంతో ఆమె స్థానంలో ఎంపిడిఒగా విశాఖపట్నం జిల్లా ఆనందపురం నుంచి ఎ. లవరాజు బదిలీపై ఇక్కడకు వచ్చి గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎంపిపి బంటుపల్లి వెంకట వాసు దేవరావును తన ఛాంబర్‌లో కలిశారు. ఈ సంద ర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ మండలాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. భాద్యతలు స్వీకరించిన ఆయనకు ఇఒపిఆర్‌డి శంకర్‌ జగన్నాథం, ఎపిఎం విజయలక్ష్మి, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.రేగిడి తహశీల్దారుగా రాములమ్మ రేగిడి: రేగిడి మండల తహశీల్దార్‌గా జె. రాములమ్మ బదిలీపై రానున్నట్లు తహశీల్దార్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. ఈమె గుమ్మలక్ష్మీపురం తహశీల్దార్‌గా పనిచేస్తూ బదిలీపై రేగిడి తహశీల్దారుగా రానున్నారు. ఇక్కడ తహశీల్దారుగా పనిచేసిన బి. సుదర్శన్‌రావు దత్తరాజేరు మండల తహశీల్దార్‌గా బదిలీపై వెళ్లారు. రాములమ్మ మరో రెండు రోజుల్లో తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కార్యాలయ అధికారులు వెల్లడించారు.డిఎస్‌పిగా శ్రీనివాసరావుబొబ్బిలి: బొబ్బిలి డిఎస్‌పిగా పోతుల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇక్కడ డిఎస్‌పిగా పని చేసిన పి.శ్రీధర్‌’కు ఏసిబికు బదిలీ కావడంతో అనకాపల్లి డిటిసిలో పని చేస్తున్న శ్రీనివాసరావు బొబ్బిలి డిఎస్‌పిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌గా రామలక్ష్మిబొబ్బిలి: మున్సిపల్‌ కమిషనర్‌గా ఎల్‌.రామలక్ష్మి గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా పని చేసిన ఎస్‌.శ్రీనివాసరావుకు జివిఎంసి డిప్యూటీ కమీషనర్‌గా బదిలీ కావడంతో జివిఎంసిలో పని చేస్తున్న రామలక్ష్మి కమిషనర్‌గా ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరిం చారు. మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేస్తామని కమిషనర్‌ రామలక్ష్మి చెప్పారు.

➡️