పలు చోట్ల గాంధీ 76వ వర్ధంతి

Jan 30,2024 20:15

ప్రజాశక్తి- మెంటాడ: మెంటాడ సచివాలయం ఆవరణలో మంగళవారం మహాత్మా గాంధీ 76వ వర్థంతి సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి గండ్రేటి అప్పలనాయుడు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రేగిడి రాంబాబు, విగ్రహాల దాత ముగడ లింగేశ్వర రావు, విశ్రాంత ఉపాధ్యాయులు మండల తిరుపతిరావు, సచివాలయం కార్యదర్శి రామనాధ్‌, రెగ్యులర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గొర్లె అప్పలనాయుడు, సచివాలయం సిబ్బంది, విధ్యార్థులు, యువకులు పాల్గొన్నారు.డెంకాడ: స్థానిక శాఖా గ్రంథాలయంలో గాంధీజీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి గ్రంథాలయాధికారి మహేష్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో గల గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే శంబంగి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణారావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడిగంజి రమేష్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ రేజేటి ఈశ్వరరావు, వైసిపి నాయకులు, పాల్గొన్నారు.శృంగవరపుకోట: స్థానిక గాంధీ పార్క్‌ ఆవరణలో గల మహత్మ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గడి బంగారునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పంచి అంజలి ఘటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️