పశువులకు నీటిని అందుబాటులో ఉంచాలి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పశువులకు తగినంత చల్లని నీటిని అందుబాటులో ఉంచాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ కే బేబీరాణి అన్నారు. మండలంలోని సంతనూతల పాడు గుమ్మళంపాడు గ్రామాలలో ఆమె గురువారం పర్యటించి పశు పోషకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బేబీరాణి మాట్లాడుతూ పశువులను ఉదయం 10 గంటల లోపు సాయంత్రం మూడు గంటల తర్వాత మాత్రమే పశువుల మేపుకునేందుకు విప్పాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో పశువులను నీడ ప్రాంతంలో కట్టివేయాలని తెలిపారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డిని పుష్కలంగా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. అనంతరం వేసవిలో పశుపోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశువైద్యాధికారి డాక్టర్‌ బి ప్రతాపరెడ్డి, పశువుల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️