పాఠశాలకు బీరువా బహూకరణ

ప్రజాశక్తి-చీమకుర్తి : మండల పరిధిలోని పాటిమీదపాలెం మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలకు సుదర్శన్‌ గ్రానైట్‌ అధినేత నూనె వెంకట సుబ్రహ్మణ్యం బీరువాను బహూకరించారు. వెంకట సుబ్రహ్మణ్యం సతీమణి నూనె వెంకటలక్ష్మి సుజాత ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం బీరువా బహూకరించారు. అదేవిధంగా సంతనూతలపాడు వాసవీ క్లబ్‌కు గ్రైండర్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన గ్రానైట్‌ అధినేతలు నూనె వంశీకృష్ణ, రేష్మి దంపతులు, నూనె అనుదీప్‌ లక్ష్మిచైత్రపద్మిని దంపతులు, కొంకిమళ్ళ చంద్రమౌళి, హేమామాలిని దంపతులు, భూమా మహానందికుమార్‌, జాబిల్లి దంపతులు, పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు ఎస్‌కె.శిలార్‌ ,ఉపాధ్యాయురాలు వాకా కవిత, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

➡️