పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

Nov 29,2023 11:45 #Annamayya district
govt fails in sanitery problems

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్రాజు ఆరోపించారు. బుధవారం పట్టణంలోని 19, 20వ వార్డులయందు మార్నింగ్ వాక్ లో భాగంగా జగన్ మోహన్ రాజు పర్యటిస్తూ ముందుగా రోజు వారి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులు లేక పూట గడవడం కూడా కష్టమైందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జగన్ రాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యవసర ధరలు, ఆకాశాన్ని ఎక్కాయని, పనులు కూడా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు నందు అంగన్వాడీ భవనం వద్ద పసిపిల్లల సౌకర్యార్థం తక్షణమే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎత్తు పెంచాలని కోరారు. అలాగే గ్రంథాలయం ఎదురుగా వర్షం పడినప్పుడు డ్రైనేజ్ కాలువలు పొంగిపొర్లుతున్నాయని, వాటికి కూడా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️