పార్టీలకతీతంగా పథకాలు

Dec 8,2023 22:02

ప్రజాశక్తి -భోగాపురం  :  పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని ఎ.రావివలస సచివాలయ పరిధిలో ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో, పథకాలు అందించడంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయనను మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండాను, పథకాలు తెలిపే డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ అప్పలనాయుడు, సవరవల్లి సర్పంచ్‌ విజయభాస్కర్‌ రెడ్డి , ఉప సర్పంచ్‌ నడుపూరు సత్యనారాయణ సూరిబాబు, నారు సాయి తదితరులు పాల్గొన్నారు.

➡️