పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

Mar 12,2024 21:44

ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని ఐసిడిఎస్‌ పిఒ కె.విజయగౌరి అన్నారు. మంగళవారం కురుపాంలో గల హుకుంపేటలో మార్చి 9 నుండి 23 వరకు పోషకాహార పక్షాత్వాలు కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలతో పోషణ పక్వాడ కార్యక్రమంపై ర్యాలీ మానవహారం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ 15 రోజుల కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రం వద్ద ప్రతి రోజూ గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు, పిల్లలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి తెలిపారు. పిల్లల్లో మేథాశక్తి, చురుకుదనం పెంపొందించేలా అన్ని శాఖల ఉద్యోగులను సమన్వయంతో కలిసి పని చేస్తూ పిల్లలందరికీ ఆటపాటలతో కూడిన విద్య, ఆహారపు అలవాట్లు పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు భవాని, విజయగౌరి, జానకి, గౌరమ్మ, శ్రావణి, భాగ్యలక్ష్మి, లత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.రక్తహీనతను అరికట్టాలి బలిజిపేట: మండలంలోని వంతరాంలో ప్రిజం 10 కార్యక్రమంలో భాగంగా రక్తహీనతను ముందుగా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌నాయుడు సూచించారు. ఈ లక్షణాలున్నట్లయితే వారు రక్తహీనతతో బాధపడుతున్నారని, వారికి వైద్యుల సలహా తప్పనిసరని అన్నారు ఈ సందర్భంగా ఆయన వాటి గురించి వివరించారు. దత్తత అధికారులు తమకు కేటాయించిన వారిని వారంలో మూడుసార్లు తప్పక సందర్శించి వారి నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేయాలని సూచించారు.

➡️