పివిటిజిల బలోపేతానికి కృషి

Feb 21,2024 21:29

ప్రజాశక్తి-సీతంపేట : ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పివిటిజిల బలోపేతానికి కృషి చేస్తున్నామని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం సీతంపేట జిసిసి కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపుకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పులిగుమ్మిలో విడివికెను సందర్శించారు. కొండచీపుర్లు యూనిటును పరిశీలించారు. భామిని మండలంలో మనముకొండలో ఉన్న వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాలు ద్వారా నిర్వహిస్తున్న పసుపు యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం గిరిజన సహకార సంస్థ ద్వారా అందిస్తున్న నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిఎం జి.సంధ్యారాణి, ఎపిఒ రోషిరెడ్డి, డిపిఎం రమణ, పాతపట్నం, సీతంపేట బ్రాంచ్‌ మేనేజర్లు జి.నరసింహులు, దాసరి కృష్ణ, ఎపిఎం విజయ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

➡️