పూడిగెడ్డపై వంతెన నిర్మించాలి

Feb 1,2024 21:37

 ప్రజాశక్తి – పాచిపెంట: మండలంలోని రాయగుడ్డివలస పంచాయతీ బయలు గుడ్డి గ్రామ సమీపాన గల పూడిగెడ్డ వద్ద వంతెన నిర్మించాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మర్రి లివ్వు, సాంబయ్య నాయకత్వంలో గ్రామస్తులు గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ వంతెన నిర్మాణం చేపట్టి గిరిజనులతో పాటు ఈ వాగు దాటి వచ్చిన గురువునాయుడుపేట గ్రామ రైతులకు, సరాయివలస, రాయిగుడ్డివలస, భీమందరవలస గిరిజనుల పనులకు ఉపయోగకరమైన రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది కలిగించిన పూడివాగు వద్ద వంతెన నిర్మించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా ఇక్కడికే రావాల్సి సందర్భంగా వాగుదాటి రావడం చాలా కష్టంగా ఉందని, అలాగే బయలుగుడ్డి నుండి ఆస్పత్రికి వెళ్లాలన్నా, పిల్లలు పాఠశాలకు వెళ్లాలన్నా వాగుదాటి వెళ్లడం ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఐటిడిఎ పిఒ, కలెక్టర్‌ ఈ ప్రాంతంలో పర్యటించి వంతెన నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని కోరారు. అలాగే విద్య, వైద్యం గిరిజనులకు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో పర్యటించి పూడిగెడ్డ వద్ద వంతెన నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

➡️