వర్షానికి జలమయమైన ప్రభుత్వ పాఠశాల ఆవరణ

ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌

మండలంలోని లంకల కోడేరు గ్రామ పరిధిలోని వెదుళ్ల పాలెం ప్రభుత్వ పాఠశాల ఆవరణ వర్షానికి జలమయమైంది. వర్షపు నీటిలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. గురువారం కురిసిన వర్షానికి డ్రెయిన్లు నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి. పాఠశాల ఆవరణలో చేరిన వర్షపు నీటిలో డ్రెయిన్‌ నీళ్లు కూడా కలిసిపోయి దుర్గంధంగా మారింది. దీంతో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు స్కూల్‌ ఆవరణలో నీళ్లు నిల్వ ఉండకుండా వెళ్లిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

➡️