పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాల కోసం 16 నుండి ఆందోళనలు

Dec 14,2023 23:42 #16, #house sites, #magalagiri, #poor

కొలనుకొండ గంగానమ్మపేటలో మాట్లాడుతున్న జొన్న శివశంకరరావు, దొంతి రెడ్డి వెంకటరెడ్డి తదితరులు

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి నియోజకవర్గంలో పేద లకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరుగు ఆందోళనలను జయప్రదం చేయాలని సిపిఎం తాడేపల్లి మండల సీనియర్‌ నాయకులు జొన్న శివ శంకరరావు అన్నారు. గురువారం రాత్రి ఎంటిఎంసి పరిధిలోని కొలనుకొండ గంగా నమ్మపేటలో విస్తత ప్రచార కార్యక్రమం జరిగింది. సిపిఎం కొలనుకొండ గ్రామ శాఖ కార్యదర్శి కాట్రగడ్డ శివన్నారాయణ అధ్యక్ష తన జరిగిన కార్యక్రమంలో శివశంకరరావు మాట్లాడుతూ తాడేపల్లి మండలంలోని కొలనుకొండ, వడ్డేశ్వరం, కుంచనపల్లి, మెల్లంపూడి తదితర గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలు అనేకమందిఉన్నారని అన్నారు. పిడబ్ల్యుడి కాల్వ కట్టల పైన, కొండ పోరం బోకు, చెరువు పోరంబోకు స్థలాలలో నివాసం ఉంటున్న పేదలకు గత పాలక, ప్రతి పక్షాలు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వ కుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రధానంగా కొలనుకొండ, వడ్డే శ్వరం అసైన్డ్‌ భూమిలో, స్థలాలలో నివాసం ఉండే పేదల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోందన్నారు. అదే విధంగా కుంచనపల్లి నుండి, చిర్రావూరు వరకు పిడబ్ల్యూడి కట్టల పై నివాసం ఉండే పేదల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దశలవారీగా జరిగే సిపిఎం ఆం దోళన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. సిపిఎం తాడే పల్లి మండల కార్యదర్శి దొంతిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ మంగళగిరిలో ఆం దోళన కార్యక్రమం అనంతరం 20వ తేదీన మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కె.బాబు, కోటేశ్వరరావు, గంగానమ్మపేట కాలనీ వాసులు పాల్గొన్నారు.

➡️