పేదలకు వరం ఆరోగ్య సురక్ష:ఎమ్మెల్సీ

Jan 9,2024 21:18

ప్రజాశక్తి-నెల్లిమర్ల : జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని ఎమ్మెల్సీ డాక్టర్‌ పివివి సూర్య నారాయణరాజు పేర్కొన్నారు. మంగళ వారం మొయిద విజయరాం పురం గ్రామ సచివాలయంలో రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ డాక్టర్‌ పివివి సూర్య నారాయణ రాజు (సురేశ్‌ బాబు) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమన్నారు. ప్రతీ సచివాలయంలో పేదలకు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించే విధంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపొందించారన్నారు. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ధీర ఫౌండేషన్‌ ద్వారా గ్రూప్‌- 2 పరీక్షలకు నిరుద్యోగ యువతకు, స్థానిక గ్రంథాలయానికి పుస్తకాలు, నూతనంగా మంజూరైన రూ.3వేల పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, డిసిసిబి వైస్‌ ఛైర్మన్‌ చనమల్ల వెంకట రమణ, వైస్‌ ఎంపిపి పి.సత్యనారాయణ, సర్పంచ్‌ ఎ.కృష్ణ, వైసిపి నాయకులు గంటా అప్పల రాజు పాల్గొన్నారు.డెంకాడ: మండలంలోని చింతలవలసలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు ప్రారంభించారు. స్పెషలిస్టు డాక్టర్లు చాణుక్య, ఎ. శ్రీనివాస్‌, మోపాడ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ జి. శరణ్య 300 మంది రోగులను తనిఖీ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పిఎఒ మజ్జి గణపతిరావు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలవలస-1 సచివాలయం సిబ్బంది, మోపాడ పిహెచ్‌సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.వేపాడ: మండలంలోని రామస్వామిపేట గ్రామ సచివాలయం వద్ద మంగళవారం సర్పంచ్‌ శర్మ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యాధికారులు రమాదేవి, రాజశేఖర్‌ 289 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఎం. జగ్గుబాబు, పంచాయతీ కార్యదర్శులు అప్పలనాయుడు, గంగాధర్‌, సచివాలయ సిబ్బంది, పాల్గొన్నారు.

➡️