పేదల అభివృద్ధికే సంక్షేమ పథకాలు

Dec 1,2023 22:55 #ap cm
ఫొటో : పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

ఫొటో : పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు
పేదల అభివృద్ధికే సంక్షేమ పథకాలు
ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్రంలో పేదల అభివృద్ధి కోసమే సంక్షేమ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి బృహత్తరమైన పథకాలను అమలు చేస్తున్నట్లు వైసిపి నాయకులు పేర్కొన్నారు. మండలంలోని పల్లవోలు సచివాలయంలో వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని ఇఒపిఆర్‌డి మస్తాన్‌ ఖాన్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన సచివాలయంలో డిస్‌ప్లే ఏర్పాటు చేసి జగనన్న పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేసిన పథకాల రూపంలో లబ్ధిదారులకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిన నగదు వివరాలను వివరించారు. ఈ సందర్భంగా వైసిపి మండల మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మేనిపెస్టోలో చెప్పినవే కాకుండా ప్రజల సంక్షేమం కోసం అనేక బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టారన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన 54నెలలు కాలంలో రెండేళ్లు కరోనాతో ప్రపంచం స్థంభించినా వెనకడుగు వేయకుండా సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారన్నారు. సచివాలయం పరిధిలో రూ.14.50కోట్ల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కఋషి చేస్తున్న ఎంఎలఎ విక్రమ్‌ రెడ్డిని 2024సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, సర్పంచ్‌ రమాదేవి, వైసిపి నాయకులు గంగినేని రవీంద్రబాబు, చండ్ర నారాయణ స్వామి, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ చెవుల శ్రీనివాసులు యాదవ్‌, సచివాలయ నాగేశ్వరరావు, గౌస్‌ బాషా, పొంగూరు సుధాకర్‌ గృహసారథులు, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️