పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం : ఎంపిపి

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎంపిపి మూడమంచు వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ సమావేశాలకు తరచూ కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు అవుతున్నారని, అలాంట వారికి మెమోలు జారీ చేయాలని ఎంపిడిఒ రామచంద్రరావుకు సూచించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి కషి చేస్తున్నట్లు తెలిపారు. మండల పరిషత్‌ నిధులు ఏమయ్యాయే తెలిపాలని అరివేముల ఎంపిటిసి బొమ్మనబోయిన వెంగయ్య ప్రశ్నించారు. నిధుల గురించి సమాచారం ఇచ్చిన తర్వాతనే సభ ప్రారంభించాలని పట్టుబట్టారు. దీనిపై ఎంపీపీ సమాధానమిస్తూ కొన్ని ఎంపీటీసీ పరిధిలో నిధులు ఇచ్చానని త్వరలో సమాచారం ఇస్తానని చెప్పడంతో సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎఒ రాధ, ఎంఇఒ ప్రసాద్‌ రావు, ఆర్డబ్ల్యుఎస్‌ ఎఇ రమేష్‌, ఎంపిడిఒ రామచంద్రరావు, వైస్‌ ఎంపిపి భూమిరెడ్డి, ప్రభంజన, ఇఒఆర్‌డిఒ సుందర రామయ్య, విద్యుత్‌ ఎఇ మోహన్‌రెడ్డి, పశువైద్యాధికారి మునీర్‌, వెలుగు ఎపిఎం విద్యాసాగర్‌,ఎంపిటిసిలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️