పేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

ప్రజాశక్తి-దర్శి : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దర్శి నగర పంచాయతీ ఒకటో వార్డులో మన ఊరికి మన శివన్న కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తొలుత అయ్యప్ప గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళలు హారతులు పట్టారు. అనంతరం ఇంటింటికీ తిరిగి సంక్షేమం గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పెన్షన్లు, రేషన్‌ బియ్యం ఇంటి వద్దే అందిస్తున్నట్లు తెలిపారు. పథకాలకు సంబంధించిన నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, షేక్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌ ఎస్‌ఎం. బాషా, వైస్‌ ఎంపిపి సోము దుర్గారెడ్డి, వార్డు కౌన్సిలర్‌ మోహన్‌బాబు, నాయకులు కర్నా భాస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, గురవారెడ్డి, ఇత్తడి దేవదానం, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

➡️