పొట్టి శ్రీరాములకు ఘన నివాళి

 

ఎంపిపి పాఠశాల్లో పొట్టి శ్రీరాములు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-మండపేట

తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్థానిక సంఘమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని ముత్యాల మాణిక్యాంబ ఆధ్వర్యంలో శ్రీరాములు చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మద్రాస్‌ రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్నన అన్యాయాన్ని సహించలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం 54 రోజులు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్‌ 15 మరణించారు. ఈయన దీక్ష ఫలితంగా అక్టోబరు 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

 

 

➡️