పొట్టి శ్రీరాములు త్యాగనిరతి చిరస్మరణీయం

Dec 15,2023 23:25
ఎంపిడిఒ పి.వెంకటనారాయణ

ప్రజాశక్తి – యంత్రాంగం

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలు జిల్లాలోని పలు మండ లాల్లో శుక్రవారం జరిగింది. కాకి నాడ రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు చేసిన త్యాగనిరతి చిరస్మ రణీయమని కలెక్టర్‌ కృతికా శుక్లా అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా శుక్రవారం కాకినాడ రామారావుపేట సిబిఎం స్కూల్‌-ఫెలోషిప్‌ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి కలెక్టర్‌ కృతికాశుక్లా, ఎంఎల్‌ఎ ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి, కూడా చైర్‌ పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఆవాల రాజేశ్వరి, సుం కర శివప్రసన్న పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌, బిసి కార్పొరేషన్‌ ఇడి బి.శ్రీనివాసరావు, బిసి సంక్షేమ అధికారిణి ఎన్‌.రాజేశ్వరి, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికా రిణి ఎ.విజయశాంతి, కాకినాడ అర్బన్‌ తహశీల్దార్‌ పివి.సీతాపతి రావు, గోదావరి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కాకినాడ జిల్లా అధ్యక్షుడు పెద్ది రత్నాజీ పాల్గొన్నారు. యు.కొత్తపల్లి స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో పొట్టి శ్రీరా ములు వర్ధంతి కార్యక్రమం ఎంపిడిఒ పి.వెంకటనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్‌ పరి పాలనాధికారి సూర్యప్రకాష్‌, వైసిపి నాయకులు కారే శ్రీనివాస్‌, ఎంపిటిసి సభ్యులు బుజ్జి, గుండ్ర రాజబాబు, పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు మచ్చలేని ప్రజా సేవా తత్పురుడని వాకర్స్‌ జిల్లా కౌన్సిలర్‌ అడబాల రత్న ప్రసాద్‌ అన్నారు. బోటు క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో శ్రీరాములు వర్ధంతి జరిగింది. ఈ కార్యక్ర మంలో రాజా, సత్యనారాయణ పాల్గొన్నారు. పెద్దాపురం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆర్‌డిఒ జె.సీతా రామా రావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మున్సి పాలిటీ ఆధ్వర్యంలో చైర్‌ పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, వైస్‌ ఛైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్‌, కనకాల మహాలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ జె.సురేంద్ర పాల్గొని నివాళులర్పించారు. సామర్లకోట రూరల్‌లో ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి సత్తిబాబు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ రామా రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ పాల్గొన్నారు.

➡️