పొర్లుదండాలతో కార్మికుల నిరసన

Jan 7,2024 21:55
ఫొటో : పొర్లుదండాలతో నిరసన తెలియజేస్తున్న కార్మికులు

ఫొటో : పొర్లుదండాలతో నిరసన తెలియజేస్తున్న కార్మికులు
పొర్లుదండాలతో కార్మికుల నిరసన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : తమ సమస్యలను పరిష్కరించాలని పొర్లుదండాలు పెడుతూ మున్సిపల్‌ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారి ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. కార్మికుల సమస్యలు ఎప్పుడో పరిష్కరించి ఉండాల్సిన ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా కాలయాపన చేసినందునే సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తురక సీనయ్య, బిడదల మహేష్‌, బాబు, పోలయ్య, మహిళా నాయకులు చిన్నమ్మ, జ్యోతి, నారాయణమ్మ, సునీత, వెంకమ్మ, కార్మికులు పాల్గొన్నారు.

➡️