పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలన

Mar 20,2024 00:02

ప్రజాశక్తి-పామూరు : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కనిగిరి ఆర్‌డిఒ జాన్‌ ఇర్విన్‌ తెలిపారు. పామూరు పట్టణంలోని పలు పోలికేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ అధికారులు రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లఘింగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. ఈ కార్యక్మ్రంలో పామూరు తహశీల్దారు షారుక్‌ బాషా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️