పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలుండాలి

Mar 26,2024 21:33

ప్రజాశక్తి – రామభద్రపురం : పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇఆర్‌ఒ, ఆర్‌డిఒ సాయిశ్రీ ఆదేశించారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ సులోచనారాణితో కలిసి కొట్టక్కి, తారాపురం స్కూల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు అవగాహన కల్పించాలని, ఆహ్లాదకర వాతావరణంలో పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండాకాలం వేడి తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఓటర్లకు నీడ కల్పించే దిశగా ఏర్పాట్లు చేయాలని చల్లని నీరు, వైద్య సిబ్బంది పోలింగ్‌ ప్రదేశంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ సిబ్బంది, బిఎల్‌ఒలు ఉన్నారు.ప్రశాంత ఎన్నికలకు పార్టీలు సహకరించాలి నెల్లిమర్ల: ప్రశాంత ఎన్నికలకు అన్ని పార్టీలూ సహకరించాలని ఇఆర్‌ఒ ఎం. నూకరాజు కోరారు. మంగళవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో ఇఆర్‌ఒ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఎలక్షన్‌ రిటర్నింగ్‌ అధికారి ఎం. నూకరాజు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలని, కోడ్‌ ఉల్లంఘన జరిగితే చర్యల తీసుకుంటామని చెప్పారు. అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు, ఉరేగింపులు చేయరాదన్నారు. కాగా రాజకీయ పార్టీలపై ఎలక్షన్‌ కమిషన్‌ నిఘా పెట్టింది కాబట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కగా అమలు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎఆర్‌ఒ డి. ధర్మ రాజు, వైసిపి, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల నియమావళి అమలకు సహకరించాలి బొబ్బిలి: ఎన్నికల నియమావళి అమలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ. సాయిశ్రీ కోరారు. తన కార్యాలయంలో మంగళవారం ఎన్నికల నియమావళిపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి లోబడి ప్రచారం, సభలు, ర్యాలీలు చేయాలన్నారు. అనుమతులు లేకుండా ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కేసులు పెడతామన్నారు. సమావేశంలో టిడిపి, వైసిపి పార్టీల ప్రతినిధులు వి.సత్యనారాయణ, మజ్జి జగన్నాధం, తదితరులు పాల్గొన్నారు.ఓటర్లకు అవగాహన కొత్తవలస: మండలంలోని 206 పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో విజ్ఞాన భారతి స్కూల్‌ ప్రాంగణం వద్ద స్వీప్‌ నోడల్‌ అధికారి పి. సునీత మంగళవారం ఓటర్లకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలన్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

➡️