పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

ప్రజాశక్తి-రేపల్లె: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆర్టీవో హేలా షారోన్‌ అధికారులను ఆదేశించారు. నియోజక వర్గంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ సంబంధించి నగరం మండలంలోని సచివాల యాలను సందర్శించి, రేపల్లెలో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరచు స్ట్రాంగ్‌ రూమ్స్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ.. ఒకే స్థానంలో 4, 5 మల్టిపుల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఉంటే ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్‌ రోజు ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దివ్యాంగుల కోసం ర్యాంప్‌, అన్ని కేంద్రాల్లో వెలుతురు కోసం లైటింగ్‌, ఫ్యాన్లు, ఫర్నిచర్‌, తాగునీరు, మరుగుదొడ్లు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలను రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్వోలు తనిఖీ చేసి అన్ని వసతులు ఉన్నాయా లేదా అనేది పరిశీలన చేసి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️