పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక సౌకర్యాలు

Dec 30,2023 21:15

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక వసతులైన తాగు నీరు, టాయిలెట్లు, రాంప్‌లు, లైట్స్‌, తదితర ప్రాథమిక సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. వచ్చే మూడు రోజుల్లో సెక్టోరల్‌ అధికారులు, ఎఇఆర్‌ఒలు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ ను తనిఖీ చేసి మౌలిక వసతులపై ఖచ్చితమైన నివేదికను జనవరి 4 వ తేదీ నాటికి అందించాలని సూచించారు. శనివారం ఎన్నికల ఆర్‌ఒలు, ఇఆర్‌ఒలు, సెక్టోరల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 వ తేదీలోగా రిఆర్‌ఒ లాగిన్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. 80 శాతం పైబడి పోలింగ్‌ స్టేషన్లు ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నందున సదుపాయాల కల్పనకు అవసరమయ్యే నిధులను పాఠశాల నిర్వహణ నిధుల నుండి ఖర్చు చేయాలని తెలిపారు. వెంటనే ఆయా హెడ్‌ మాస్టర్లతో మాట్లాడుకొని, స్కూల్‌ నిర్వహణ కమిటీ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పనులన్నీ జనవరి 20 నాటికి పూర్తి చేసి మలి నివేదికను అప్‌లోడ్‌ చేయాలన్నారు. క్లెయిమ్స్‌ , అభ్యంతరాల డిస్పోజల్‌ కు గడువు పెంచినందున పెండింగ్‌ ఉన్న దరఖాస్తులన్నిటినీ ఈ 10 రోజుల్లో పూర్తిగా డిస్పోజ్‌ చేయాలని తెలిపారు. సమావేశంలో జెసి మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ అనిత, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర రావు, దొర, సుధారాణి, సెక్టోరల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️