పోలియోను సమూలంగా నిర్మూలించాలి

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లాలో పోలియోను సమూలంగా నిర్మూలించేందుకు వైద్యాధికారి ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అన్నారు. మార్చి 3న ఆదివారం జాతీయ పల్స్‌ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పల్స్‌ పోలియో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సమన్వయంతో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా పల్స్‌పోలియో గోడిపతులను జిల్లా కలెక్టరు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎస్‌ విజయమ్మ, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి టి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి, డిఆర్‌డిఏ పిడి, ఐసిడిఎస్‌, ఎస్‌ఈ విద్యుత్‌, పిడి మెప్మా, డిఈఒ, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రాంతీయ అధికారి, ఇతర టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️